పెదబయలు: మండలంలోని గిన్నెలకోట పంచాయతీ ఇనుపతీగల గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామ సమీపంలోని చర్చిని మట్టి కప్పేసింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొండచరియలు వరి, పసుపు పంటలపై మేటలు వేసినట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు ప్రమాదంలో చిక్కుకునే వారని, గండం గడిచిందని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శిగా గంగాధర్
సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రీమలి గంగాధర్‌ను వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యా లయం గురువారం ఓ ప్రకటన వెలువడింది.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ : ఏజెన్సీ డీఈవో
గంగవరం: వెనుకంజలో ఉన్న విద్యార్థినుల చదువు మెరుగుపడే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు సూచించారు. గురువారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల లెసెన్ ప్లాన్స్ రికార్డులను, విద్యా కిట్లను పరిశీలించారు. పాఠశాల హెచ్‌ఎం వరలక్ష్మి, డిప్యూటీ వార్డెన్ లావణ్య ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.