
వరద బాధితులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
వి.ఆర్.పురం: ఇటీవల వచ్చిన గోదావరి వరదలపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, వరద బాధితుల పట్టించుకోలేదన ప్రకటిస్తే టీడీపీ నాయకులకు ఉలికెందుకని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, నాయకుడు మాచర్ల గంగులు అన్నారు. పార్టీ ముఖ్య కార్యక్రర్తల సమావేశం మంగళవారం ముత్యాల గౌతమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి వరదలు 3వ ప్రమాదహెచ్చరికకు చెరువుగా వచ్చినా కూటమి ప్రభుత్వం బాధితుల పట్టించుకోలేదన్నారు. వరదలు వచ్చిన వారం రోజుల తరువాత కూరగాయలు అరకొర ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి విలీన మండలలో వరదల సమయంలో పర్యటించ లేదని, బాధతులను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వరద బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీని కూటమి నాయకులు విమర్శించటం సిగ్గుచేటు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబు, నాటి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ సేవలను పొగిడిన టీడీపీ నాయకులు ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అమలుచేయని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నాయకులు చిక్కాల బాలు, బోడ్డు సత్యనారాయణ, వడ్డాణాపు రాజారావు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు, మోడం నరేష్, జోన్నడ నాగేశ్వరావు, రేవు బాలరాజు, పెట్ట రాజు, కోట్ల సత్యనారాయణ, గుటాల ఫణీంద్ర, గణితీ రామకృష్ణ, నూనె రవీంద్ర, వరక రాజేంద్ర, మావర్ల రిషీ పాల్గొన్నారు.
పీసా కమిటీ ఎన్నిక వాయిదా
వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్
మాదిరెడ్డి సత్తిబాబు