
పొంగిన వాగులు, గెడ్డలు
● అప్రమత్తమైన జలాశయాల సిబ్బంది
● 18 వేల క్యూసెక్కులు విడుదల
జగదల్‌పూర్ వరకే రైళ్లు
● ఛత్తీస్‌గడ్‌లో భారీ వర్షాలు
● కొత్తవలస–కిరండూల్ లైన్లో నిలిచిన రైళ్ల రాకపోకలు
సాక్షి,పాడేరు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కొత్తవలస–కిరండూల్ లైన్‌లో జగదల్‌పూర్ వరకే రైళ్లు నడుస్తున్నాయి. జగదల్‌పూర్‌కు 45కి లోమీటర్ల దూరంలోని దంతేవాడ–బచ్చిలి రూట్‌లో సిలక్‌జొహ్రి నుంచి కుమరసొద్ర రైల్వే స్టేషన్ల ట్రాక్‌లన్నీ వరద నీటితో మునిగాయి. ఈ స్టేషన్ చెరువులా మారింది. సమీప ప్రాంతంలో వరదనీటి ఉధృతి అధికంగా ఉంది. పలు చోట్ల ట్రాక్‌పై మట్టి పేరుకుపోయింది. ఈ లైన్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో కొత్తవలస నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లన్నీ జగదల్‌పూర్ వరకే నడుస్తున్నాయి. కిరండూల్ నుంచి వచ్చే రైళ్లు కూడా దంతేవాడ ప్రాంతంలోనే నిలిచిపోయాయి.
జోలాపుట్టు, డుడుమకు వరద తాకిడి
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ,జోలాపుట్టు జలాశయాలకు భారీగా వరదనీరు పోటెత్తుంది. ఏకధాటిగా కురు స్తున్న వర్షాలకు వీటి నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్ట్‌ల గేట్లపై నుంచి నీరు వెళ్లిపోతుండడంతో జలాశయాల సిబ్బంది అప్రమత్తం అయ్యారు. డుడుమ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా మంగళవారం నాటికి 2587.75 అడుగులుగా నమోదయింది. దీంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది.5,6,7 గేట్లను పైకెత్తి 6వేల క్యూసెక్కులు జలాశయం దిగువన ఉన్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయానికి ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 2750 అడుగులు కాగా ఆదివారం నాటికి 2748.50 అడుగులు నీటి నిల్వ ఉంది. దీంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది ఒడిశా స్పిల్‌వే జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 6వేలు, ఏపీ ప్రధాన జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 6 వేల చొప్పున మొత్తం 12వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం వల్ల వరదప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం తెల్లవారు నుంచి రాత్రి వరకు కుండపోత వర్షంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయకచవితి ఏర్పాట్లకు ఇబ్బంది ఏర్పడింది. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాడేరు డివిజన్ పరిధిలోని ప్రధాన మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది.జిల్లాలో 385.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా పెదబయలులో 49.8 ఎంఎం, పాడేరులో 45.4ఎంఎం,అరకులోయలో 44.4ఎంఎం, ముంచంగిపుట్టు 42.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పాఠశాల భవనంపై కూలిన చెట్టు
హుకుంపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంపై మంగళవారం చెట్టు కూలిపోయింది. ఆ సమయంలో తరగతి గదిలో 14మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. భవనం దృఢంగా ఉన్నందున పెను ప్రమాదం తప్పిందని విద్యాకమిటీ చైర్మన్ జగదీష్ తెలిపారు.
సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సీలేరు పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. జనజీవనం స్తంభించింది. సీలేరు, దుప్పలువాడ, ధారకొండ, ధారాలమ్మ తల్లి ఘాట్ మార్గంలో వర్షం తగ్గుముఖం పట్టలేదు. సీలేరు నుంచి భద్రాచలం వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో జల విద్యుత్ కేంద్రం వద్ద మంగళవారం భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వలసగెడ్డ, మాదిగమల్లు, చిన్న గంగవరం, జి.నేరేడుపల్లి ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
పొంగిన చాపరాయి గెడ్డ
డుంబ్రిగుడ: ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. మండలంలోని గుంటసీమ రహదారి గోమంగి రోడ్డు వద్ద వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. దిగువవైపు ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. చాపరాయిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు పర్యాటకుల సందర్శన నిలిపివేశారు. పోతంగి పంచాయతీ గోడసరు గ్రామానికి వెళ్లే రహదారిలో కొండవాగు ప్రవాహ ఉధృతికి రోడ్డు కోతకు గురైంది.
ఎడతెరిపి లేకుండా వర్షాలు
పెరుగుతున్న నీటిమట్టాలు
మత్స్యగెడ్డకు వరద ఉధృతి
జిల్లావ్యాప్తంగా 385.4 ఎంఎం వర్షపాతం నమోదు

పొంగిన వాగులు, గెడ్డలు

పొంగిన వాగులు, గెడ్డలు

పొంగిన వాగులు, గెడ్డలు

పొంగిన వాగులు, గెడ్డలు

పొంగిన వాగులు, గెడ్డలు

పొంగిన వాగులు, గెడ్డలు

పొంగిన వాగులు, గెడ్డలు