
మార్కెట్‌కు చవితి శోభ
● పూజా సామగ్రి కొనుగోళ్లతో కళకళ
● పాడేరులో కిటకిటలాడిన మెయిన్‌రోడ్డు
సాక్షి, పాడేరు: జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం మార్కెట్‌కు మంగళవారం వినాయక చవితి శోభ నెలకొంది. వర్షాన్ని సైతం భక్తులు లెక్కచేయకుండా పూజాసామగ్రిని కొనుగోలు చేశారు. జిల్లా కేంద్రమైన పాడేరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు మెయిన్ రోడ్డు వరకు మార్కెట్ ప్రాంతం కిక్కిరిసి పోయింది.
హాని చేస్తున్నా.. పీవోపీ వైపే మొగ్గు
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారు చేసిన విగ్రహాలే ఎక్కువగా కనిపించాయి. వీటి వినియోగం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అవగాహన కల్పిస్తున్నా ఉత్సవ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. వీటి తయారీకి వినియోగించే పీవోపీతోపాటు రంగుల్లోని రసాయనాల వల్ల పర్యావరణంతోపాటు జల రాశులకు తీవ్ర నష్టం కలుగుతోంది. జిల్లా కేంద్రమైన పాడేరులో మంగళవారం వ్యాపారులు అందుబాటులో ఉంచిన వాటిలో అధికశాతం పీవోపీతో తయారు చేసిన విగ్రహాలే ఉన్నాయి. ఉత్సవ నిర్వాహకులు వీటిని కొనుగోలు చేసి తీసుకువెళ్లారు. అడుగు నుంచి పది అడుగుల వరకు పీవోపీతో తయారుచేసిన గణపతి విగ్రహలను వ్యాపారులు రూ.2వేల నుంచి రూ.20వేల ధరకు విక్రయించారు. మట్టితో తయారుచేసిన విగ్రహాలు పెద్దగా కనిపించలేదు.
● పీవోపీ విగ్రహాలను గెడ్డలు, చెరువులు, నదులు, వాగులలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో ఉండే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ థర్మాకోల్ తీవ్ర నష్టం కలిగిస్తాయి. జలరాశులు నాశనమవుతాయి. వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడతాం.
అవగాహన కల్పిస్తున్నాస్పందన శూన్యం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన గణపతి విగ్రహాల వల్ల పర్యా వరణంపై తీవ్ర ప్రభా వం చూపుతుంది. ప్రతి ఏడాది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల ద్వారా మట్టి గణపతి విగ్రహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ స్పందన కనిపించడం లేదు. పర్యావరణంపై ప్రభావంతోపాటు నీటి కాలుష్యంతో సకల జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
– డాక్టర్ భరత్‌కుమార్‌నాయక్,
రసాయన శాస్త్ర విభాగాధిపతి,
అరకు డిగ్రీ కళాశాల

మార్కెట్‌కు చవితి శోభ

మార్కెట్‌కు చవితి శోభ

మార్కెట్‌కు చవితి శోభ