
రాగల ఐదు రోజుల్లోమోస్తరు వర్షాలు
● చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్
అప్పలస్వామి
చింతపల్లి: జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు వర్షపాతం ఐదు నుంచి 60 ఎంఎం వరకు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలు ఉండవచ్చునన్నారు. గాలిలో తేమ శాతం గరిష్టంగా 83 డిగ్రీలు, కనిష్టంగా 80 డిగ్రీలు ఉంటుందని, గంటకు 10 కిలోమీటర్లు వేగంతో గాలి వీస్తుందని ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రైతులు పొలాల్లో, పశువులు షెడ్లలో నీరు నిల్వ ఉండకుండా దారులు ఏర్పాటుచేసుకోవాలని ఏడీఆర్ సూచించారు.