
డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు
వై.రామవరం: స్థానిక వారపుసంతలో సోమ వారం ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించా రు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఈ తనిఖీలు జరిపారు. వారపు సంతకు వచ్చివెళ్లే వాహనాలను, వాటిలో రవాణా చేస్తున్న సామగ్రిని పరిశీలించారు. అనుమానాస్పద ప్రదేశాల్లో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు.ఈతనిఖీల్లో స్టేషన్ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ జి42 బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు.