
కొట్టుకుపోయిన కాజ్‌వే
అరకులోయటౌన్: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని మాదల పంచాయతీ కమలతోట నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే మార్గంలో గల కాజ్‌వే కొట్టుకుపోయింది. అరకులోయ–లోతేరు ఆర్‌అండ్‌బీ రహదారి జంక్షన్ నుంచి కమలతోట వరకు రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రక్టర్, కమలతోట గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే మార్గంలోని గెడ్డపై కాజ్‌వే నిర్మించారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు ఉధృతంగా రావడంతో రెండు రోజుల కిందట కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.