
టెన్త్ విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు బేస్‌లైన్ టెస్ట
పెదబయలు: టెన్త్ విద్యార్థుల సామర్థ్యాలను అంచనావేయడానికి ఈ ఏడాది బేస్‌లైన్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు గురుకుల రాష్ట్ర పరిశీలకుడు జాన్సన్ దేవరాజు తెలిపారు. టెన్త్ పరీక్షల్లో జిల్లాలోని గురుకులాల్లో ఉత్తీర్ణత బాగా తగ్గడంతో రాష్ట్ర గురుకుల కార్యదర్శి గౌతమి ఆదేశాల మేరకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. అల్లూరి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ వారం నుంచి పరీక్షలు జరుపుతున్నట్టు తెలిపారు. స్థానిక గురుకుల విద్యాలయంలో సోమవారం టెన్త్ విద్యార్థులకు నిర్వహించిన సామర్థ్య పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అల్లూరి జిల్లాలో 33 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చిందని, దానిని వందశాతం పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు బేస్‌లైన్ పరీక్షలను పాఠశాలల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహించేవారని, దీంతో విద్యార్థుల సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయలేకపోయారన్నారు. ఇప్పుడు గురుకుల అధికారుల పర్యవేక్షణలో బేస్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించి, సామర్థ్యాలు అంచనావేస్తామన్నారు. జిల్లాలోని ప్రతి గురుకులంలో పది వారాల పాటు,నెలకు రెండు సార్లు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌రావు పాల్గొన్నారు.
గురుకుల రాష్ట్ర పరిశీకుడు జాన్సన్ దేవరాజు