
పీసా కమిటీ ఉపాధ్యక్షుని ఎన్నిక నేటికి వాయిదా
కొయ్యూరు: రాజేంద్రపాలెం పీసా కమిటీ ఉపాధ్యక్షుని ఎన్నిక కోరం లేక మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం రేవళ్లు,కినపర్తి,రాజేంద్రపాలెంలలో పీసా కమిటీ ఎన్నికలను నిర్వహించారు. రాజేంద్రపాలెం కమిటీ కార్యదర్శిగా సోలాబుకు చెందిన ఎల్.రమణను ఎన్నుకున్నారు. అయితే ఉపాధ్యక్షుని స్థానానికి ఎస్.సూరిబాబు, స్వామినాయుడు పోటీపడ్డా రు. ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.దీంతో ఎన్నిక నిర్వహించవలసి వచ్చింది. దీనికి కోరంగా 425 మంది సభ్యులు ఉండాలి. వ్యవసాయ పనులు జరుగుతుండడంతో సమావేశానికి వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేసినట్టు ఎన్నికల అధికారి ఎస్.గో పాలం ప్రకటించారు.గతంలోను రెండు సార్లు ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీటా సింహాచలం,పంచాయతీ కార్యదర్శి మౌనిక పాల్గొన్నారు. కోరం లేకపోవడంతో రేవళ్లుకూడా ఎన్నిక వాయిదా పడింది.