
పక్కాగా గిరిజన చట్టాల అమలుకు చర్యలు
రంపచోడవరం: గిరిజన చట్టాలను పక్కాగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. 1/70 చట్టం అమలుపై ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, ఏపీవో డీఎన్‌వీ రమణలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అక్రమ కట్టడాల నివారణకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ పి.అంబేడ్కర్, తహసీల్దార్ బాలాజీ,డీఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.