
బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మరింత విస్తృతం
రాజవొమ్మంగి: బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను మరింత విస్తృత పరుస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ బిజినెస్ ఏరియా జనరల్‌మేనేజర్ పి.రాజు తెలిపారు. మండలంలోని జడ్డంగి ఎక్స్ఛేంజ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా సాక్షితో మాట్లాడారు. మండలంలో మొత్తం 34 సెల్‌టవర్లు ఉన్నాయని, వీటిలో దాదాపు అన్నింటికీ సోలార్ ప్యానెళ్లు అమర్చామన్నారు. తరచూ విద్యుత్ సరఫరాలో అవాంతరాల వల్ల నెట్‌వర్క్ అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
రూ.1 సిమ్‌ను సద్వినియోగం చేసుకోండి
ఒక్క రూపాయికే అందజేస్తున్న సిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సిమ్ ద్వారా నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా, టాక్ టైం పూర్తిగా ఉచితమన్నారు. ఈ సిమ్ పొందడానికి ఈనెల 31వ తేదీ తుది గడువని చెప్పారు. నెల రోజుల ఉచిత సేవలు అనంతరం నచ్చిన ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.