
మొరాయించిన ఆర్టీసీ బస్సు
రాజవొమ్మంగి: కొయ్యూరు మండలం రేవళ్ల నుంచి రాజవొమ్మంగి మీదుగా రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు దూసరపాము గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం నిలిచిపోయింది. క్లచ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఈ బస్ నిలిచినట్టు సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. రాజవొమ్మంగి ఏలేశ్వరం మధ్య గోతుల రహదారితో సతమతమౌతున్నామని, ఈ మార్గంలో కాలం చెల్లిన బస్‌లను తిప్పుతూ మరింత వేధిస్తున్నారంటూ పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి మెరుగైన రహదారి, రవాణా సదుపాయాలు కల్పించాలని, ఇప్పటికై నా అధికారులు స్పందించి కండిషన్‌లో ఉన్న బస్సులను నడపాలని కోరారు.