
ఆదికర్మయోగి అభియాన్ విజయానికి కృషి చేయాలి
రాజవొమ్మంగి : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆదికర్మయోగి అభియాన్‌ను విజయవంతం చేయడానికి అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో కృషి చేయాలని గిరిజనసంక్షేమ శాఖ రంపచోడవరం డీఈ గౌతమి కోరారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యా లయంలో ఎంపీడీవో యాదగిరీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆదికర్మయోగి అభియాన్‌పై ఉద్యోగులకు ఆమె అవగాహన కల్పించారు. మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మ్యాపింగ్, ఏక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. ఆదివాసీ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాయక్, ఎంఈవో సూరయ్యరెడ్డి పాల్గొన్నారు.