
సమాజాభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకం
● అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
● మీడియా అత్యుత్తమ పాత్ర పోషించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గుమ్మా తనుజారాణి, జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు: నేటి సమాజంలో మీడియా అత్యుత్తమ పాత్ర పోషించాలని, సమాజాభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకమని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్రలు అన్నారు.మండలంలోని ఏనుగురాయి పంచాయతీ పర్తపుట్టు గ్రామంలో ఏపీయూడబ్ల్యూజే పాడేరు ప్రెస్‌క్లబ్ సమావేశం సోమవారం ఘనంగా జరిగింది. వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్రలు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నిలిస్టులకు నేడు సమస్యలతో సావాసం చేస్తున్నారన్నారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామి ,ప్రింట్, ఎలక్ట్రానిక్స్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌కుమార్, కార్యవర్గ సభ్యులు నాగరాజు,ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్‌లకు సీనియర్ జర్నిలిస్టులకు ఎంపీ తనూజరాణి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర చేతుల మీదుగా శాలువాలు కప్పి ,జ్ఞాపికలు అందించి, సన్మానించారు. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వి.రమేష్, పాత్రికేయులు సత్యనారాయణ, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకం