
రైతుల అభ్యున్నతికి కృషి
రంపచోడవరం/గంగవరం: డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయం కొవ్వూరు ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో గంగవరం మండలం రాజంపేట, ఆముదాలబంద గ్రామాల్లో పరిశోధన కేంద్రం శాస్త్రవేతలు, అధికారులు సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవీంద్రకుమార్, డాక్టర్ ఏ.స్నేహలతారాణి, ఏఈవో మల్లుదొర తదితరులు పంటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలిచ్చారు. గ్రామా ల్లోని కర్రపెండలం, ఆయిల్ పామ్, బెండ, బీర, జీడిమామిడి పంటలను పరిశీలించారు. పంటల స్థితిగతులను తెలుసుకున్నారు. వివిధ పంటలకు రైతులకు కావాల్సిన వనరుల గురించి చర్చించారు. ఈ విషయాలను ఆల్ ఇండియా పరిధిలో చర్చించి గ్రామంలోని రైతులకు మేలు జరిగేలా ప్రాజెక్టును రాసి వనరులను కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లో గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఎంపీఈవో స్వర్ణలత, రైతులు ప్రసాద్ దొర, ప్రదీప్ కుమార్, సత్యనారాయణ, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.