
పొంచి ఉన్న ప్రమాదం
● జారిపడుతున్న బండరాళ్లు, మట్టి
● రాకపోకలకు అంతరాయం
గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి 516ఈలో రోడ్డుపైకి బండరాళ్లు వచ్చిపడుతున్నాయి. ప్రయాణాలు సాగిస్తున్న సమయంలో అవి పడితే ప్రయాణికుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కొయ్యూరు మండలం కాట్రగెడ నుంచి రంపుల వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కొన్ని చోట్ల కొండలను తొలచి పగులగొ ట్టారు. రహదారి పనులు చేపట్టారు. తరువాత అక్కడ రక్షణ గోడలను అంతంత మాత్రం నిర్మించారు. ఈ కారణంగా వర్షాలకు మట్టి కరిగిపోయి కొండలపై నుంచి బండరాళ్లు దొర్లి వస్తున్నాయి. అదే సమయంలో ఎవరైనా ద్విచక్ర వాహనాలు లేదా పెద్ద వాహనాల్లో ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బండరాళ్లతో పాటు మట్టిపల్లాలు రోడ్డుపైకి వచ్చేస్తుంది. ఇలాంటి సమయాల్లో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జాతీయ రహదారిపై జారిపడిన పెద్ద బండరాయి

పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం