
బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పరామర్శ
వి.ఆర్.పురం: మండలంలోని ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన, ప్రమాదవశాస్తూ గాయపడిన మూడు కుటుంబాలను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆదివారం పరామర్శించారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు, వార్డు సభ్యుడు పరంకుశం దేవి, శ్రీనివాసు దంపతుల కుమారుడు వంశీకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిసి సంతాపం తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ముత్యాల యశ్వంత్ ప్రమాదశాస్తూ ఇటీవల జరిగిన ప్రమాదంలో రెండు చేతుల విరగడంతో ఆ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరమర్శించారు, మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ముత్యాల నాగేశ్వరరావు ఇటీవల జరిగిన ప్రమాదంలో వ్యాన్‌పై నుంచి కింద పడి మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిసి ప్రగాఢ సంతాపం తెలిపారు. పర్యటనలో భాగంగా ఒడ్డుగూడెంలోని కాపరపు సంగీత, దుర్గాప్రసాద్ కుటుంబాన్ని కలిశారు. వారి 11 నెలల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుందని తరచూ ఏడుస్తూనే ఉందని, పాపను కాపాడాలని చిన్నారి తల్లి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎదుట బోరున విలపించింది. దీనిపై తక్షణమే స్పందించిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ చిన్నారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏర్పాటుచేస్తామని, సహాయ సహకారం అందిస్తా నని ఆమె భరోసా ఇచ్చారు. వైస్ ఎంపీపీ ముత్యాల భవానీ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, నాయకులు చిక్కాల బాలు, బోడ్డు సత్యనారాయణ, కోటం జయరాజు పాల్గొన్నారు.