
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతపల్లి: గిరిజన రైతాంగం వలిసెలు సాగులో శాసీ్త్రయ , యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. పరిశోధన స్థానంలో గిరిజన ఉపప్రణాళికలో భాగంగా వలశెలలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల నిర్వహణపై రైతులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వలసెల సాగులో మెలకువలు పాటించాలన్నారు.వలిసెల పంటలో విత్తనాల ఎంపికను తెలియజేశారు. ఈ వలిసెల పంట, తేనెటీగలు పెంపకం ప్రాధాన్యతలు, ఆర్థికాబివృద్దిని వివరించారు.ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్యి మాట్లాడుతూ వలిసెలు ప్రథమశ్రేణి క్షేత్రాలు లక్ష్యాలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు జీవన ఎరువులు ఉపయోగాలను తెలియజేశారు. విత్తనశుద్ధిని ప్రయోగాత్మకంగా చూపించారు. జీవన ఎరువులు వినియోగాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా రైతులకు వలిసెల విత్తనాలు, జీవన ఎరువులను ,వానపాముల ఎరువులను పంపిణీ చేశారు.శాస్త్రవేత్తలు డాక్టర్ బాలహుస్సేన్‌రెడ్డి, డాక్టర్ వెంకటేష్‌బాబు, సందీప్‌నాయక్, దుచ్చరపాలెం, ఏబులం అసరాడ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.