
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గిరి యువకుడు ఎంపిక
● సత్తా చాటుతున్న మంజిత్
గూడెంకొత్తవీధి: మండలంలోని లక్కవరపుపేట పంచాయతీ కె.కొడిసింగికి చెందిన గిరిజన యువకుడు గడుతూరి మంజిత్ ఫుట్‌బాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆడుతున్నాడు. గుంటూరు లయోలా పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న మంజిత్‌కు చిన్నప్పటి నుంచి ఫుట్ బాల్ క్రీడ అంటే చాలా ఇష్టం. అప్పటినుంచి ఈ క్రీడలో మెలకువలు తెలుసుకుంటూ రాణిస్తున్నాడు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయికి ఎంపిక కావడంపై ఈ ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.