
గురువర్యా మీకిది తగునా..!
ఉపాధ్యాయులు బోధకులు మాత్రమే కాదు.. విద్యార్థుల జీవితాలపై ప్రభావాన్ని చూపే మార్గదర్శకులు. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వారు అసలు విధులకు వెళ్లకుండా వారి జీవితాలను చీకటిమయం చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా 41 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు విధులకు ఎగనామం పెడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో పిల్లల భవిష్యత్‌పై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గూడెంకొత్తవీధి: మండలంలోని తోకరాయి, పెట్రాయ్, డి.అగ్రహారం, కుమ్మరితోట, కొండపాకలు, దారకొండ ఇలా 16 పంచాయతీల పరిధిలోని 41 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు బడి ముఖం చూడటం లేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎంపీపీ బోయిన కుమారి సహా పలువురు నేతలు సంబంధిత అధికారులకు వినతులు ఇచ్చారు. అయినప్పటికీ విద్యాశాఖ ఉన్నతాధికారుల్లో స్పందన కరువైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● పాఠశాలలు తెరచి మూడు నెలలు కావస్తున్నా గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో అక్క డ విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
విధులకు డుమ్మా
41 పాఠశాలల్లో ఇదే పరిస్థితి
వినతులిచ్చినా చర్యలు శూన్యం
ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

గురువర్యా మీకిది తగునా..!