
బైక్‌లు ఢీ.. ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్ర గాయాలు
● ఎదురెదురుగా వస్తుండగా ప్రమాదం
● కొరంజిగుడ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద ఘటన
డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వా పంచాయతీ కొరంజిగుడ ఘాట్ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఇదే పంచాయతీ మాలిగవలస గ్రామానికి చెందిన జి.లవకుశ, యోగేంద్రనాయక్ అరకు వారపుసంతకు బైక్‌పై బయలుదేరారు. అదేమార్గంలో అరకు నుంచి మాలివలసకు బైక్‌పై ఒడిశాకు చెందిన కుబియా ముకుంద్ (25) వస్తున్నాడు. వీరి ఇరువురి బైక్‌లు కొరంజిగుడ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో కుబియా ముకుంద్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యోగేంద్రనాయక్ (25)ను అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకువెళ్తుండగా ఎస్.కోటవద్ద మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న జి. లవకుశను 108లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ముక్కు, నోటి నుంచి రక్త స్రావం తీవ్రంగా అవుతుండటంతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ముకుంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో కుబియా ముకంద్ మాలికవలసకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఒడిశాలో ఉంటున్న అతను అత్తవారింటికి వచ్చి ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌లు ఢీ.. ఇద్దరి మృతి

బైక్‌లు ఢీ.. ఇద్దరి మృతి