
ప్యాకేజీ ఇవ్వరు.. సాయం చేయరు..
వరద బాధితులకు అందని
దయనీయంగా పరిస్థితి
వీఆర్‌పురం: వరదలు వచ్చి మూడు రోజులు అవుతున్నా బాధితులకు నిత్యావసర సరకులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరద నీరు గ్రామాలను ముంచెత్తడంతో కొండలు, గుట్టలపై తలదాచుకుంటున్న బాధిత కుటుంబాల పరిస్థితి సాయం అందక దయనీయం ఉంది. వరద వచ్చి వెళ్లిపోతున్నా ఇప్పటి వరకు మండలంలోని ఒక్క గ్రామానికి కూడా నిత్యావసర సరకులు అందలేదన్న విమర్శలున్నాయి.
● ప్రభుత్వ లెక్కల ప్రకారం మండలంలో సుమారు 608 కుటుంబాలు వరద బారిన పడ్డాయి. అంతేకాకుండా 85 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటూ వెళ్లలేని దయనీయ స్థితిలో ఉన్న ఆ కుటుంబాలు సాయం అందక అల్లాడుతున్నాయి. శ్రీరామగిరి పంచాయతీ కల్తూనూరులో 40 ఇళ్లు, కొత్తూరులో 6, చొక్కనపల్లిలో 176 ఇళ్లు, శ్రీరామగిరిలో 188, వడ్డుగూడెంలో 83, వడ్డుగూడెం కాలనీలో 95, గుండుగూడెంలో 20 ఇళ్లు నీటమునిగాయి. ఆయా కుటుంబాలకు ఇప్పటివరకు నిత్యావసర సరకులు అందలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా శనివారం నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు.
● వరద ముంపునకు గురైన శ్రీరామగిరి, తోటపల్లి గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ దినేష్‌కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ పర్యటించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. వరదలు వచ్చిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, త్వరగా పరిహారం చెల్లించి తరలించాలని కలెక్టర్‌ను కోరగా వచ్చే ఏడాదిలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జెండాలు తొలగింపునకు వినతి
తాము సాగు చేసుకుంటున్న భూముల్లో సీపీఎం అధ్యర్యంలో గిరిజన సంఘం పాతిన జెండాలను తొలగించాలని అఖిలపక్షం అధ్యర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్‌కు వీఆర్‌పురం గిరిజనేతర రైతులు వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి, పునరావాసం, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి తరలించే వరకు ఎవరి భూములు వారే సాగు చేసుకొవచ్చు అని నిర్వాసితులకు అప్పట్లో ప్రభుత్వం చెప్పిందని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎవరి భూములు వారే సాగు చేసుకోవచ్చన్నారు.
నిత్యావసర సరకులు