
కలెక్టర్ దృష్టికి సమస్యలు
కూనవరం: గోదావరి వరదలు సంభవించిన ప్రతిసారీ మండల పరిధిలోని సుమారు పది గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయని తక్షణం వాటికి విద్యుత్ సరఫరా చేయాలని పెదార్కూరు సర్పంచ్, మడకం నాగమణి, ధర్ముల అమ్మాజీ కోరారు. శుక్రవారం పెదార్కూరు వచ్చిన కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. భీమవరం సబ్‌స్టేషన్ నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వెంబడి బురదగూడెం వరకు కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. బురదగూడెం రోడ్డు నుంచి తుమ్మల గ్రామం వరకు రోడ్డు నిర్మిస్తే వరదల సమయంలో వెయ్యి కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆర్కూరు బస్టాండ్ నుంచి నుంచి బోదునూరు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. చాలామంది రైతులపేర్లు పట్టాలున్నా వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కలేదని తక్షణం వాటిని నమోదు చేయాలని కోరారు. వీటిపై వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.