అత్యవసర వైద్యం.. అందనంత దూరం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

Aug 18 2025 6:33 AM | Updated on Aug 18 2025 6:33 AM

అత్యవ

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

జిల్లాలోని విలీన మండలాలతోపాటు పక్కరాష్ట్రాలకు పెద్ద దిక్కయిన చింతూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల అత్యవసర వైద్యానికి కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రులకు గాని తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి రిఫర్‌ చేయడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలలుగా ఈ సమస్య నెలకొన్నా పరిష్కారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానరావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

ఒడిశాకు చెందిన ఇతని పేరు సరియం లక్ష్మ య్య. కాళ్లు, చేతులు వాపువచ్చి నడవలేని స్థితిలో చింతూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఇతనికి వైద్యం చేసేందుకు జనరల్‌ ఫిజీషియన్‌ అవసరముంది. అయితే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కోటిరెడ్డి మత్తు వైద్య నిపుణుడు కావడంతో జనరల్‌ ఫిజీషియన్‌ను సంప్రదించి ఆయన సూచనలమేరకు వైద్య అందించడంతో కోలుకున్నాడు. అతనికి అత్యవసర వైద్యం అవసరమైతే పరిస్థితి అగమ్య గోచరమే.

చింతూరు మండలం కుయిగూరుకు చెందిన ఈ యువకుడి పేరు పూనెం సాయిప్రణీత్‌. రెండురోజులక్రితం పాఠశాలలో ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో అతని కాలుకు తీవ్రగాయం కాగా చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎముకల వైద్యనిపుణుడు లేకపోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ ఎముకల వైద్యనిపుణుడు అందుబాటులో వుంటే రిఫర్‌ చేసే పరిస్థితి ఉండేది కాదు.

చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రధాన సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 పడకలుగా అప్‌గ్రేడ్‌ అయిన ఈ ఆస్పత్రికి చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 200 నుంచి 300 వరకు ఓపీ ఉంటుంది. సుమారు 60 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారు. ఇవికాకుండా డయాలసిస్‌, పిల్లల విభాగం, కాన్పు విభాగాలు అదనంగా ఉన్నాయి. ఏడుగురు వైద్య నిపుణులకుగాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. సూపరింటెండెంట్‌ (మత్తు వైద్య నిపుణుడు) డాక్టర్‌ కోటిరెడ్డి, ఇద్దరు సీ్త్రల వైద్య నిపుణులు, ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు పనిచేస్తున్నారు. జనరల్‌ ఫిజీషియన్‌, ఆర్ధోపెడిక్‌, పిడియాట్రిషియన్‌, ఈఎన్‌టీ నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

● ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బిడ్డింగ్‌ ప్రాతిపదికన కాంట్రాక్టు విధానంలో వైద్య నిపుణులను నియమించింది. వారు కోరుకున్న వేతనానికి జనరల్‌ ఫిజీషియన్‌, ఆర్ధోపెడిక్‌, పిడియాట్రిషియన్‌, ఈఎన్‌టీ, గైనకాలజిస్టులను ఏర్పాటుచేసింది. వీరికి ఒకొక్కరికి రూ.2.50 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు వేతనాలు పొందేవారు.

కీలక పోస్టులు ఖాళీ..

ఈ ఆస్పత్రిలో వైద్యనిపుణులు ఒకొక్కరు వెళ్లిపోతున్నారు. దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరల్‌ ఫిజీషియన్‌ ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిపోగా పిడియాట్రీషియన్‌కు అడ్డతీగల బదిలీ అయింది. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఆర్ధోపెడిక్‌, ఈఎన్‌టీ వైద్యులకు ఇతర ఆస్పత్రుల్లో పర్మినెంట్‌ పోస్టులు రావడంతో వారుకూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం వైద్యనిపుణుల్లో ఇద్దరు గైనకాలజిస్టులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు తరచూ ఒకటి రెండు రోజులు ట్రైనింగ్‌ లేదా రంపచోడవరం ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారు. దీంతో ఉన్న ఒకరిపై అదనపు భారం పడుతోంది. ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులుండగా రోజుకు ఒక్కరు చొప్పున ఓపీ రోగులను పరీక్షిస్తున్నారు. ఓపీకి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మత్తు వైద్యనిపుణుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి కూడా ఓపీ బాధ్యతలు చూస్తున్నారు.

● వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులను తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే ఆంధ్రా కేసులు చూడమని అక్కడి వైద్యులు చెబుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఆస్పత్రిలో అంబులెన్సు లేకపోవడంతో 108 వాహనం మీద ఆధారపడాల్సి వస్తోందని, మేము అంతదూరం రాలేమని 108 సిబ్బంది చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. ప్రస్తుతం చింతూరు ఆస్పత్రిలో ప్రతిరోజూ ఏడు నుంచి 10 వరకు మలేరియా కేసులతో సహా 25 నుంచి 30 వరకు జ్వరాల కేసులు నమోదవుతున్నాయి.

● గత ప్రభుత్వంలో బిడ్డింగ్‌ ద్వారా కాంట్రాక్టు పద్ధతిన వైద్య నిపుణుల నియామకం చేపట్టగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడమే వైద్య నిపుణులు పనిచేసేందుకు ముందుకు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది.

వైద్య నిపుణుల్లేక ఇబ్బందులు

వైద్య నిపుణులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేయాల్సి వస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఇన్‌పేషెంట్లు అధికంగా ఉన్నందున వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని కూడా నివేదిక పంపించాం.

– డాక్టర్‌ ఎంవీ కోటిరెడ్డి, సూపరింటెండెంట్‌,

చింతూరు ప్రభుత్వాస్పత్రి

చింతూరు ప్రభుత్వాస్పత్రిలో

వైద్య నిపుణుల కొరత

భద్రాచలం, కాకినాడ,

రాజమహేంద్రవరం ఆస్పత్రులకు రిఫర్‌

ఇబ్బందులు పడుతున్న

రోగులు, బంధువులు

గాలిలో దీపాల్లా గిరిజనుల ప్రాణాలు

నాలుగు నెలలుగా సమస్య నెలకొన్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

అత్యవసర వైద్యం.. అందనంత దూరం1
1/4

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

అత్యవసర వైద్యం.. అందనంత దూరం2
2/4

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

అత్యవసర వైద్యం.. అందనంత దూరం3
3/4

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

అత్యవసర వైద్యం.. అందనంత దూరం4
4/4

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement