
పోలీసుల అదుపులో ఒడిశా వేటగాళ్లు
గూడెంకొత్తవీధి: స్థానిక పోలీసులు ఒడిశాకు చెందిన 13 మంది వేటగాళ్లను గురువారం సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అప్పలసూరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ శాఖ అందించిన ముందస్తు సమాచారం ప్రకారం పోలీసులు మండల కేంద్రంలోని పోస్టాఫీసు సమీపంలో ఏడు బైక్‌లపై వెళ్తున్న ఒడిశా వేటగాళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు ద్విచక్రవాహనాలు, 7 సెల్‌ఫోన్‌లతో సుమారు 300 కిలోల వణ్యప్రాణుల మాంసం స్వాఽఽఽఽధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.