నాకు చావాలని లేదు, పోరాడాలని ఉంది.. కానీ

I Want to live Please Help For My Surgery - Sakshi

నా పేరు యశ్వంత్‌. మాది విజయవాడ. పదేళ్ల పిల్లలాగే స్నేహితులతో ఆడుకోవడమంటే ఇష్టం. అయితే గత మేలో జ్వరం వచ్చింది,. అప్పటి నుంచి స్నేహితులతో ఆడుకోవడానికి నాకు వీలుపడటం లేదు. ఇక ముందు కూడా నేను ఆడుకోలేను కావొచ్చు. 

ఈ ఏడాది వేసవిలో వరుసగా పదిహేను రోజుల పాటు జ్వరం వచ్చింది. ఆ తర్వాత వాంతులు కూడా మొదలయ్యాయి. ఏదీ తిన్నా క్షణాల్లో బయటకి వచ్చేది. దీంత అమ్మానాన్నా భయపడ్డారు. నన్ను పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. 

అక్కడ డాక్టర్లు రకరకాల పరీక్షలు చేశారు. సిరంజీలతో రక్తం తీసుకున్నారు. ల్యాబ్‌లకు పంపించారు. చివరకు నాకు మైలోడిస్‌ప్లాస్టిక్‌ సిండ్రోమ్‌ ఉందంటూ అమ్మానాన్నలకు డాక్టర్లు చెప్పారు. అదేం రోగమో నాతో పాటు అమ్మాన్నాలకు ముందుగా అర్థం కాలేదు. చివరకు అదో రకరమైన  బ్లడ్‌ క్యాన్సర్‌ అని తెలిసింది.

 

ఎలాగైనా నన్ను బతికించుకోవాలని మా అమ్మానాన్న ఆరాటపడ్డారు. రకరకాల పరీక్షలు చేయించారు. మెడిసిన్స్‌ ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా శరీరం ఇంకా బలహీనమైపోయింది. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నడవలేని స్థితికి చేరుకున్నాను. చివరకు మందులతో లాభం లేదని డాక్టర్లు తేల్చారు. 

నా ఆరోగ్యం మెరుగుపడాలంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఒక్కటే మార్గమంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయి, బతుకుపై ఆశ వదిలేసుకున్న నాకు, అమ్మానాన్నలకు ఆ మాట వరంలా అనిపించింది. కానీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి దాదాపు రూ.20 లక్షల ఖర్చు అవుతుంది.
సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్‌ చేయండి

మానాన్న రోజువారి కూలీ. నెలంతా కష్టపడితే రూ.6000లకు మించి రాదు. ఇప్పటికే నా ఆస్పత్రి ఖర్చుల కోసమని వాళ్లిద్దరు ఉన్నదంతా అమ్మేశారు. అయినకాడికి అప్పులు తెచ్చారు. నన్ను బతికించుకునేందుకు వాళ్లు చేయాల్సిందంతా చేశారు. 
సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇప్పుడీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి అవసరమైన డబ్బులను నా తల్లిదండ్రులు సర్థుబాటు చేసే పరిస్థితి లేదు. అప్పుడే మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టో గురించి తెలిసింది. మీరు సాయం చేస్తే ఆపరేషన్‌కి అవసరమైన డబ్బు సర్థుబాటు అవుతుంది. నా ప్రాణాలు నిలబడతాయి.
 సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్‌ చేయండి

మాయదారి క్యాన్సర్‌తో రోజురోజుకి నా ఆరోణ్యం క్షీణిస్తోంది. ఒంట్లో శక్తి లేకుండా తగ్గిపోతుంది. కానీ నాకు బతకాలని ఉంది. స్నేహితులతో ఆడుకోవాలని ఉంది. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, మా అమ్మానాన్నలని మంచిగా చూసుకోవాలని ఉంది. అది జరగాలంటే మీ సహకారం అవసరం. నా ఆపరేషన్‌కి మీవంతు సాయం చేయండి. నా ప్రాణాలు కాపాడండి. (అడ్వర్టోరియల్‌)
 సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top