కేబుల్‌.. ట్రబుల్‌! | Additional load on electric poles | Sakshi
Sakshi News home page

కేబుల్‌.. ట్రబుల్‌!

Aug 8 2024 12:25 PM | Updated on Aug 8 2024 12:25 PM

Additional load on electric poles

    విద్యుత్‌ స్తంభాలపై అదనపు భారం 

    తరచుగా షార్ట్‌ సర్క్యూట్‌లు.. విద్యుత్‌ అంతరాయాలు

    తొలగింపునకు ఆదేశాలు జారీ చేసిన సీఎండీ

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ స్తంభాలకు పెద్ద గుదిబండగా మారిన ఇంటర్నెట్, టీవీ కేబుళ్లపై డిస్కం యుద్ధం ప్రకటించింది. విద్యుత్‌ అంతరాయాలకు, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌లకు, కారి్మకుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ కేబుళ్లను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లు, ఇంటర్నెట్, టీవీ కేబుల్‌ ఆపరేటర్లతో డిస్కం సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ సమావేశం అయ్యారు. 

వీధుల్లోని కరెంట్‌ స్తంభాలకు అడ్డగోలుగా అమర్చిన కేబుళ్లతో జరుగుతున్న ప్రమాదాలు, తలెత్తుతున్న అంతరాయాలపై చర్చించారు. మరమ్మతుల సమయంలో కార్మికుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ వైర్లు..అటు వినియోగదారులకు, ఇటు డిస్కంకు అనేక నష్టాలను తెచి్చపెడుతున్నాయి. గుట్టలుగా పేరుకుపోయిన ఈ కేబుళ్లను తక్షణమే తొలగించాల్సిందిగా సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని డివిజన్లలో తొలగింపు చర్యలు కూడా చేపట్టారు.   

మరమ్మతులకు అడ్డుగా కేబుళ్లు   
ఇంటర్నెట్, టీవీ ఛానళ్ల ఆపరేటర్లు ఇష్టం వచి్చనట్లు కేబుళ్లు వేశారు. వీధుల్లో ఏ స్తంభాన్ని పరిశీలించిన..కిలోల కొద్ది వైర్లు చుట్టి ఉన్నాయి. వీటి బరువుతో స్తంభాలు కొన్ని వంగి..మరికొన్ని విరిగిపోతున్నాయి. ఏదైనా స్తంభం, ఇంట్లో కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తలెత్తితే..ఆ సమయంలో పోల్‌పై ఉన్న కేబుళ్లన్నీ దగ్ధం అవుతున్నాయి. ఆ మంటలు సరీ్వసు వైర్ల నుంచి ఇంటికి, అపార్ట్‌మెంట్, షాపులకు అంటుకుంటున్నాయి. అగి్నకీలలు ఎగిరి దుస్తులు, మండే స్వభావం ఉన్న రసాయన పదార్థాలపై పడుతుండటంతో భారీ అగ్నిప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. 

దీంతో ఇటు వినియోగదారులే కాకుండా అటు డిస్కం కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అంతేకాదు కొత్త కనెక్షన్ల జారీ, సరీ్వసు వైర్లకు కనెక్షన్‌ ఇవ్వడం, ఇన్సులేటర్‌ ఫెయిల్‌ వంటి మరమ్మతుల కోసం కారి్మకులు స్వయంగా పోల్స్‌ ఎక్కాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆయా కేబుళ్లు వారి పనికి అడ్డుతగులుతుండటమే కాకుండా అపార్ట్‌మెంట్‌లోని జనరేటర్, ఇంట్లోని ఇన్వర్టర్‌ నుంచి పవర్‌ రివర్షన్‌ అవడం, కారి్మకులు షాక్‌కు గురై, కిందపడి చనిపోతున్న దాఖలాలు కూడా లేకపోలేదు. ఇలా ఏటా 10 నుంచి 15 మంది కారి్మకులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తుంది. 

కేబుళ్ల మాటున అక్రమ కనెక్షన్లు   
విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించేందుకు డిస్కం ఇటీవల లైన్‌ టు లైన్‌ సర్వే చేపట్టింది. గ్రేటర్‌లోని 3,285 (11 కేవీ) ఫీడర్లలో 4,46,540 పాయింట్లలో తనిఖీ చేసి, ఆయా వివరాలను ‘11 కేవీ ఫీడర్‌ మేనేజ్‌ మెంట్‌ యాప్‌’లో నమోదు చేసింది. 12,598 విద్యుత్‌ స్తంభాలు, 1320 డీటీఆర్‌లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించింది. ఆ మేరకు వాటి ఫోటోలు సహా జీఐఎస్‌ మ్యాప్‌లను యాప్‌లో పొందుపర్చింది. మెజార్టీ స్తంభాలకు కిలోల కొద్దీ కేబుళ్లు వేలాడుతున్నట్లు గుర్తించింది. ఈ కేబుళ్ల బరువుకు కొన్ని స్తంభాలు ఒక వైపు వంగినట్లు కని్పంచగా, మరికొన్ని మధ్యలో పగుళ్లు ఏర్పడి, విరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకొన్నయితే ఏకంగా తుప్పుపట్టి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement