టీవీకి కేబుల్ వైర్ కనెక్ట్ చేస్తుండగా..
ఘట్కేసర్ :టీవీకి కేబుల్ వైర్ కనెక్ట్ చేస్తుండగా విద్యుత్‌షాక్ సంభవించి వ్యక్తి మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఏదులాబాద్ గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఏదులాబాద్ గ్రామానికి చెందిన కూరం జంగయ్య ఆదివారం సాయంత్రం తన ఇంటిలోని టీవీకి కేబుల్ వైర్ కనెక్ట్ చేస్తుండగా విద్యుత్షాక్కి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
కాగా ఈ ప్రమాదానికి కేబుల్ ఆపరేటర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ జంగయ్య మృతదేహంతో అతడి కుటుంబ సభ్యులు గ్రామంలోని కేబుల్ ఆపరేటర్ ఇక్బాల్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.