ఆదిలాబాద్: ఆర్టీసీ అందిస్తున్న మంత్లీ సీజన్ టికెట్ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియో గం చేసుకోవాలని డిపో మేనేజర్ ఎన్.సాయన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని ఠాగూ ర్ హోటల్ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు మంత్లీ సీజన్ టికెట్లు, విహారయాత్రలు, శుభకార్యాలకు ప్రత్యేక బస్సుల సౌకర్యాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. మంత్లీ సీజన్ టికెట్‌తో నిర్ణీత రూట్ పరిమితి లేకుండా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఈ–టికెట్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీతో 20 రో జులకు బదులుగా 15రోజుల చార్జీ మాత్రమే వసూలు చేస్తు న్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు నెలల టికెట్లకు అదనపు చెల్లుబాటు గడువు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇతర రూ ట్లలో ప్రయాణించినప్పుడు కూడా రాయితీలు పొందవచ్చన్నా రు. కార్యక్రమంలో కంట్రోలర్ సాంబన్న, తదితరులు పాల్గొన్నారు.


