నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం

Nov 28 2026 12:50 AM | Updated on Nov 28 2026 12:50 AM

బోథ్‌: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యంగా పనిచేయాలని డీఎంహెచ్‌వో సాధన అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్‌ పరిధిలోని ఆయా పీహెచ్‌సీల పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు, ఎంఎల్‌హెచ్‌పీలు హాజ రయ్యారు. మాతాశిశు ఆరోగ్యం, ఆసుపత్రుల్లో ప్రసవాలు, ఎన్‌సీడీ, వ్యాధి నిరోధక టీకాలు, క్షయ, కుష్ఠుతో పాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో మనోహర్‌, డీసీహెచ్‌ రవీంద్ర ప్రసాద్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి వైసీ శ్రీనివాస్‌, ఎంహెచ్‌ఎన్‌ ప్రోగ్రాం అధికారి నిలోఫర్‌, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి వంశీ, జిల్లా ప్రోగ్రాం అధికారి దేవి దాస్‌ నాయక్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement