ఇచ్చోడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూముల రీసర్వే సత్ఫలితాలు ఇస్తోంది. హద్దుల సమస్యలతో పాటు సర్కారు భూముల లెక్క సైతం తేలుతోంది. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగి పోతున్నాయి. ప్రధానంగా భూముల గెట్ల పంచా యితీలకు చెక్ పడుతుంది. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో చేపట్టిన ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తయిన గ్రామాలకు సంబంధించి గుర్తించిన అంశాలపై రెవెన్యూ అధికారులు త్వరలో గ్రామసభలు నిర్వహించనున్నారు. భూములకు సంబంధించిన నక్షలను రైతులకు పంపిణీ చేయనున్నారు.
నక్ష అంటే..
నక్ష అంటే గ్రామ రెవెన్యూ పటం. ఇందులో గ్రా మంలో ఉన్న భూములకు సంబంధించిన నిర్ధారిత భౌగోళిక హద్దులతో పాటుగా రైతులకు కేటాయించిన సర్వే నంబర్ల వివరాలు ఉంటాయి. ప్రతీ సర్వే నంబర్‌లో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆధికారికంగా నిర్ధారించి అందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్, అటవీ, దేవాదాయ, తదితర భూములను వర్గీకరిస్తారు. రోడ్లు, కాలువలు, ఆబాదీలు, తదితర అన్ని వివరాలు నమోదు చేస్తారు. గ్రామ హద్దులతో ఒక రూపం ఇవ్వడాన్నే నక్ష అంటారు. భూ ముల సరిహద్దులకు సంబధించిన ప్రాథమిక ఽఆధారంగా నక్ష పనిచేస్తుంది. రెవెన్యూలో నక్షనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపే పెద్ద ఆధారం.
జిల్లాలో భూసర్వే వివరాలు
మండలాలు 21
మొత్తం రెవెన్యూ గ్రామాలు 505
రీ సర్వేకు నిర్ణయించిన గ్రామాలు 70
ఇప్పటి వరకు సర్వే పూర్తయినవి 08
పకడ్బందీగా రీసర్వే
జిల్లా వ్యాప్తంగా నిర్ణయించిన గ్రామాల్లో రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రామ సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తాం. పూర్తిస్థాయిలో హద్దుల నిర్ధారణ జరిగి మేజర్ సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రభుత్వ భూముల లెక్క పక్కాగా తేలడంతో పాటు నక్షల రూపకల్పనకు దోహదపడనుంది.
– ప్రభాకర్, సర్వే ల్యాండ్ ఏడీ,
ఆదిలాబాద్


