ఆదిలాబాద్: తెలంగాణ వేదికగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించా లనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండి యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్వో దయానంద రెడ్డి, కౌన్సిలర్ ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


