చేయూత.. అందలే! | - | Sakshi
Sakshi News home page

చేయూత.. అందలే!

Nov 28 2026 12:50 AM | Updated on Nov 28 2026 12:50 AM

● ప్రొసీడింగ్‌లు పంపిణీ చేసినా.. ● 3వేల మందికి జమకాని డబ్బులు ● బ్యాంకు అకౌంట్ల తప్పిదాలు, సాంకేతిక సమస్యలు కారణమనే అభిప్రాయం

కై లాస్‌నగర్‌: పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తు న్న నిరుపేదల కల సాకారం చేయాలని భావించిన ప్రభుత్వం ఇటీవల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చు ట్టింది. ఈ నెల 18 నుంచి ఎంపికై న లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేసింది.గురువారం నుంచి వారిబ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ చే సింది. దివ్యాంగులకు నెలకు రూ.4,016 అందించగా, ఇతర లబ్ధిదారులకు రూ.2,016 చొప్పున విడుదల చేసింది. అయితే చాలా మంది లబ్ధిదారులకు సాంకేతిక తప్పిదాల కారణంగా సొమ్ము ఇంకా వారి ఖాతాల్లో జమకాలేదు. ఇందుకు కొంత సమ యం పట్టే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

ఏడేళ్లుగా పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన వేలాది మంది పేదలు వా టి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీరి పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక విచారణ చేపట్టింది. గ్రామస్థాయిలో కార్యదర్శులు, పట్టణ పరిధిలో వార్డు అధికారులు వాటిని పరిశీలించారు. అలాగే రాష్ట్రస్థాయిలో 360 డిగ్రీస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద అర్హులైన 14,551 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం వీరికి రూ.3కోట్ల 68లక్షల 84వేల 816 నిధులను మంజూరు చేసింది. మరో 1,014 మంది దరఖాస్తులను తిరస్కరించారు.

3,223 మందికి మరింత ఆలస్యం

కొత్తగా మంజూరు చేసిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్‌ జ మచేస్తోంది. ఇది వరకు ఇది మున్సిపాలిటీకి మాత్ర మే పరిమితం కాగా అక్రమాలకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో తాజాగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు. జిల్లాలో 14,551 మంది కొత్త పింఛన్‌దారులకు గాను ప్రస్తుతం 11,328 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మాత్రమే నగదు జమైంది. ఇంకా 3,223 మందికి జమకాలేదు. వీరంతా కొంతకాలం వేచిచూడకతప్పని పరిస్థితి. దరఖాస్తు సమయంలో అందించిన బ్యాంకుఖాతాలు సక్రమంగా పనిచేయకపోవడం, వివరాలు తప్పుగా ఉండటం, బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేసి ఉండటం, ఈకేవైసీ పెండింగ్‌లో ఉండటం వంటి ఇతరత్రా సాంకేతిక కారణాలతో జమకానట్లుగా తెలుస్తోంది. ల బ్ధిదారులు బ్యాంకులను సంప్రదించి వాటిని సరిచేసుకోవడం ద్వారా తిరిగి పొందే వెసులుబాటు ఉంటుందని డీఆర్డీఏ పింఛన్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement