నార్నూర్: గాదిగూడ మండలం లోకారి–కే గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున ఫ్యూజ్ వేసేందుకు వెళ్లిన ఆపరేటర్ గోకుల్ విద్యుత్‌షాక్‌కు గురై తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ ఫీడర్‌ను పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకపోవడంతో సరఫరా నిలిచిపోలేదు. దీంతో ఆయన విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఎడమ చేయి, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గోకుల్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


