ఉట్నూర్రూరల్: చదువు ఒక్కటే భవిష్యత్తును మార్చే ఆయుధమని ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్ మండలం చెరువుగూడ గ్రామంలో మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 300 మందికి వైద్యులు పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు, బాబాలను నమ్మకుండా ఆరోగ్య సమస్యలు వస్తే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఏందా, లింగోజితండా, ఉట్నూర్ ఎక్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఎస్పీ పారంభించారు. కార్యక్రమాల్లో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, సీఐ ప్రసాద్, సర్పంచ్లు కిరణ్కుమార్ రాథోడ్, మాయ హరినాయక్, భగవంతరావు, వైద్యులు సందీప్ ఐత్వార్, టి. వెంకటేశ్, ఇందూజ, శ్వేత, సౌమ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


