కదంతొక్కిన కాషాయ దండు | - | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన కాషాయ దండు

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

● నిర్మల్‌లో బీజేపీ మహాపాదయాత్ర సక్సెస్‌ ● వర్షంలోనూ కొనసాగిన కార్యక్రమం

● నేతల ప్రసంగంతో శ్రేణుల్లో ఫుల్‌జోష్‌

నిర్మల్‌: ‘ఛత్రపతి శివాజీ వారసులకు, కత్తిలాంటి కార్యకర్తలకు జన్మనిచ్చిన నిర్మల్‌గడ్డకు దండాలు’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ జోష్‌ నింపారు. ‘నిర్మల్‌ జిల్లా నలుమూలల నుంచి వేలాది గా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలను చూస్తుంటే వచ్చేది మన ప్రభుత్వమే అని స్పష్టమవుతోంది’ అని ఎంపీ ఈటల రాజేందర్‌ ఉత్సాహాన్ని పెంచా రు. ‘వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెంట నడిచిన కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ స్థానిక ఎమ్మె ల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి అన్న మాటలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. ఓట్‌ చోరీ అంటూ అటు కాక్రోచ్‌ పార్టీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు, ప్రజల్లోకి తమ వా దనను తీసుకెళ్లేందుకు ఉత్తర తెలంగాణలో బీజేపీ నిర్వహించిన తొలి మహాపాదయాత్ర విజయవంతమైంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం దాదాపు నాలుగు గంటలపాటు సాగిన కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నా రు. కాంగ్రెస్‌పార్టీ నిరసనలకు భారీ జనసమీకరణతో పార్టీ సమాధానం చెప్పడం కాషాయదళంలో కొత్త ఉత్సాహాం నింపింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, ఈ కార్యక్రమ ముఖ్యఅతిథి సునీల్‌ బన్సల్‌ సభలో మాట్లాడకపోవడం గమనార్హం.

రెండు గంటలు నడిచి..

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ రోడ్డు హెలిప్యాడ్‌ వద కు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌బన్సల్‌ చేరుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన పార్టీ నేతలందరూ కలిసి ప్రత్యేక వాహనంలో స్థానిక శాంతినగర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సునీల్‌బన్సల్‌, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర సహ ఇన్‌చార్జీలు రేఖాశర్మ, అభయ్‌పాటిల్‌, కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఆదిలా బాద్‌, మల్కాజ్‌గిరి ఎంపీలు నగేశ్‌, ఈటల, ముధో ల్‌, ఆదిలాబాద్‌, సిర్పూర్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్యేలు రామారావుపటేల్‌, పాయల్‌ శంకర్‌, పాల్వాయి హరీశ్‌, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారా యణగుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్‌, సీనియర్‌ నాయకులు, భారీసంఖ్యలో వచ్చిన కార్యకర్తలతో కలిసి మహాపాదయాత్ర ప్రారంభించారు. శాంతినగర్‌ చౌరస్తా నుంచి శివాజీచౌక్‌, చైన్‌గేట్‌, జయశంకర్‌ సర్కిల్‌ మీదుగా వివేక్‌చౌక్‌ వరకు దాదాపు రెండు గంటలు పాదయాత్ర చేశారు. వివేక్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు.

మూటలు మోసి, పదవి రెన్యూవల్‌..

ప్రజల ఓట్లతో గెలిచిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ వా రం ఢిల్లీకి డబ్బుల మూటలు మోస్తూ తన పదవిని రెన్యూవల్‌ చేసుకుంటున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన రోహింగ్యా ఓట్ల కోసమే కాంగ్రెస్‌ ఓట్‌చోరీ అంటోందని మండిపడ్డారు.

రుణాలు రీషెడ్యూల్‌ చేయాలి

కై లాస్‌నగర్‌: కరువు పరిస్థితుల కారణంగా పంట నష్ట పోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రుణాల రీషెడ్యూలింగ్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని 20 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపారు. వీటిలో నాలుగు తీవ్ర కరువు, 16 మోస్తరు ప్రభావితంగా వర్గీకరించినట్లు వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ మార్గదర్శకాల ప్రకారం తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతుల పంట రుణాలను ఐదేళ్ల కాలపరిమితి కలిగిన టర్మ్‌ లోన్లుగా మార్చనున్నట్లు తెలిపారు. మోస్తరు కరువు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను మూడేళ్ల కాలపరిమితితో రీషెడ్యూల్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు కేటగిరీల రైతులకు రుణ చెల్లింపులపై మొదటి 12 నెలల పాటు మారటోరియం సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్‌ 1నుంచి సెప్టెంబర్‌ 30 వరకు మంజూరైన కొత్త పంట రుణాలు, రెన్యువల్‌ చేసిన రుణాలను నిబంధనల ప్రకారం పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అర్హులైన రైతులను గుర్తించి, రుణాల రీషెడ్యూలింగ్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎల్‌డీఎం ఉత్పల్‌ కుమార్‌, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, బ్రాంచ్‌ మేనేజర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement