చోరీకి గురైన నాలుగు వెంటిలెటర్లు గతనెల 30న ఆర్‌ఐసీయూ విభాగంలో ఘటన సెక్యూరిటీ, సిబ్బంది కన్నుగప్పి పట్టపగలే దొంగతనం గతంలోనూ పలు ఘటనలు
గతంలోనూ ఘటనలు..
రిమ్స్‌లో భద్రత డొల్ల అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ పీజీ విద్యార్థిపై అక్కడే పనిచేసే ఓ నర్సింగ్ విద్యార్థి వేధింపులకు గురిచేయడం, బాలికల హాస్టల్ నుంచి సెల్‌ఫోన్ల దొంగతనం, వెనుక వైపు కిటికీ నుంచి ఓ దుండగుడు పైకి ఎక్కడం, పేషెంట్ల దగ్గర నుంచి సెల్‌ఫోన్లు, ఇత ర వస్తువులు ఎత్తుకెళ్లడం, పార్కింగ్ చేసిన వాహనాలు చోరీకి గురవ్వడం, రిమ్స్‌లో పనిచేసే వైద్యులు, సిబ్బందిపై రోగుల బంధువులు దాడి కి దిగడం.. ఇలా అనేకం చోటుచేసుకుంటున్నా యి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దీంతో ఘటనలు జరిగిన సమయంలో నిందితులను గుర్తించడం కష్టతరంగా మారుతోంది. ఒక షిఫ్టులో కనీసం 30 నుంచి 40 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నా, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులతో కొంత మంది సిబ్బంది మిలాఖతై వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను వివరణ కోరగా.. నాలుగు వెంటిలెటర్లు చోరీకి గురైన మాట వాస్తవమేనని తెలిపారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని వివరించారు.
అసలేం జరిగిందంటే..
గతనెల 30న మధ్యాహ్నం 2.37 గంటలకు రిమ్స్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఆర్‌ఐసీ యూ విభాగంలో సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పల్మనాలజీ విభాగంలోని ఆర్‌ఐసీయూ వార్డు, చెస్ట్, సారి, టీబీ వార్డుల్లో కలియ తిరిగారు. ఆర్‌ఐసీయూ, చెస్ట్ విభాగంలో ఉన్న రెండు వెంటిలెటర్లు, దానికి ఎదురుగా ఉన్న సారి, టీబీ విభాగంలోని మరో రెండు వెంటిలెటర్లను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. అక్కడ స్టాఫ్‌నర్సులు, సెక్యూరిటీగార్డు, పేషెం ట్‌కేర్ ఉన్నట్లు సమాచారం. పట్టపగలే ఘటన చోటుచేసుకోగా వారంతా ఏంచేశారనేది ప్రశ్నా ర్థకంగా మారింది. ఒక్కో వెంటిలెటర్ విలువ రూ.8లక్షలవరకు ఉంటుంది. దాదాపు రూ.35 లక్షల విలువ గల పరికరాలు చోరీ కావడం విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం ఎంఐసీయూలో కూడా ఒక వెంటిలెటర్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన విషయం సైతం బయటపడింది. వైద్యులు, సిబ్బంది, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీగార్డులు పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే రిమ్స్‌కు సంబంధించిన సిబ్బంది సహకారం ఉంటుందనే చర్చా సాగుతోంది. కాగా, ఇద్దరు దొంగలు వెంటిలెటర్లను సంచిలో పెట్టుకొని దర్జాగా తీసుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంటే, మంగళవారం అధి కారుల దృష్టికి రావడం వారి పర్యవేక్షణ అర్థమవుతోంది. అత్యవసరంగా రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన పరికరాలు లేకపోతే కనీ సం వైద్యులు కూడా దాని గురించి ఆరా తీయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


