అసమ్మతి వీడినట్లేనా!? | - | Sakshi
Sakshi News home page

అసమ్మతి వీడినట్లేనా!?

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

● కూటమి కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌ ప్రత్యేక సమావేశం ● మున్సిపల్‌ అధికారుల సమక్షంలో సమస్యలపై ఆరా

కై లాస్‌నగర్‌: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసిన కూటమి (కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంకు చెంది న) కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, చైర్‌పర్సన్‌కు చెప్పినా ప్రయోజనం లేదంటూ గత నెల 30న నిర్వహించిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాన్ని వారు బహిష్కరించిన విషయం తెలిసిందే. సొంత పార్టీ తో పాటు చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో మద్దతి చ్చిన బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కౌన్సిలర్లు సైతం ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడంపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష బీజేపీకి ఇది ప్రధానఅస్త్రంగా ఉపయోగపడే ఆస్కారమేర్పడింది. ఈ క్రమంలో అసమ్మతి మరింత పెరుగకుండా చైర్‌పర్సన్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మంగళవా రం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌తో పాటు టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ వంటి ప్రధాన శాఖల అధికారులు, కూటమి కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ్యులు వివిధ సమస్యలపై లేవనెత్తిన అభ్యంతరా లను ప్రస్తావిస్తూ ఎందుకు పరిష్కరించడం లేదనే దానిపై ఆరా తీశారు. మ్యుటేషన్లు, అసెస్‌మెంట్లతో పాటు కౌన్సిలర్లు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. సీసీఐ, స్పిన్నింగ్‌ మిల్లు ఆస్తి పన్ను బకాయిల వసూలుపై కౌన్సిలర్లు అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో అందుకు తీసుకున్న చర్యలను వారికి వివరించారు. ఈ అంశాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లి త్వరితగిన పరిష్కారమయ్యేలా చూడాలని కోరనున్నట్లుగా చెప్పడంతో కౌన్సిలర్లు సైతం సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలి సింది. ఈసమావేశంతో చైర్‌పర్సన్‌, కూటమి కౌన్సి లర్లకు మధ్య ఏర్పడిన అఽగాధం తొలగిపోయినట్లేనా అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతుంది.

మున్సిపల్‌ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement