పత్తి ధర డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తి ధర డౌన్‌

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

● క్వింటాలుకు రూ.8,780 ● పక్షం రోజుల్లోనే రూ.500 తగ్గింపు ● రైతుల్లో ఆందోళన ● సీసీఐ రంగంలోకి దిగే అవకాశం

ఆదిలాబాద్‌టౌన్‌: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి. అసలే దిగుబడి సగానికి తగ్గి అవస్థలు పడుతున్న వారు ప్రస్తుతం ధరాఘాతంతో ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పత్తి దిగుబడి ఎకరానికి కనీసం 4 క్వింటాళ్ల వరకు కూడా రావడం లేదు. కొనుగోళ్ల ప్రారంభ సమయంలో రూ.9వేలకు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.8,780కి పడిపోయింది. రోజురోజుకు ధర తగ్గుతుండడంతో రైతులు హతాశులవుతున్నారు. అంతర్జాతీయ మా ర్కెట్‌లో భేల్‌ ధర అధికంగా ఉండడంతో పక్షం రో జుల క్రితం క్వింటాలుకు రూ.9,200తో కొనుగోలు చేసిన వ్యాపారులు, ప్రస్తుతం రూ.500 తగ్గించేశారు. రోజూ ధర ఎంతోకొంత తగ్గుతూనే ఉంది. రెండు మూడు రోజుల్లో మద్దతు ధర కంటే తక్కువ కు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని తెలు స్తోంది. సీసీఐ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

30వేల క్వింటాళ్ల కొనుగోలు..

గతనెల 22న ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లను కలెక్టర్‌ రాజర్షిషా ప్రారంభించారు. మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్‌ వ్యాపారులు వేలం పాడి విక్రయాలు చేపట్టారు. మొదటి రోజు ధర రూ.9,260 ఉండగా, రెండు రోజుల తర్వాత రూ.9,200, ఆ తర్వాత రూ.9,100, రూ.9వేలు ఇలా.. ధర పడిపోతూనే ఉంది. మంగళవారం రూ.8,780తో కొనుగోలు చేశారు. ధర పెంచాలని రైతులు వ్యాపారులను వేడుకుంటున్నప్పటికీ ససేమిరా అంటున్నారు. గత్యంతరం లేక వారు నిర్ణయించిన ధరకే విక్రయించి రైతులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. పత్తి ధర రూ.10వేల వరకు పెరుగుతుందని ఆశపడ్డ వారి మళ్లీ మద్దతు ధరకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో 30వేల 118 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. 4116 మంది రైతులు విక్రయించారు. గతేడాది యార్డులో మొత్తం 8లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయగా, సీసీఐ 7లక్షల 60వేల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. గతేడు కంటే ఈసారి తక్కువగానే కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement