నిర్మల్‌టౌన్: అండర్–17 ఎస్జీఎఫ్ బాలుర క్రికెట్ విభాగంలో నిర్మల్‌కు చెందిన జాదవ్ ఉమేశ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల గద్వాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు. వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లోని గువాహటిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొననున్నాడు. నిర్మల్ శివారు కొండాపూర్‌లోని లక్కీ క్రికెట్ అకాడమీలో కోచ్ సుదర్శన్ వద్ద బ్యాటింగ్ విభాగంలో శిక్షణ పొందిన ఉమేశ్ జాతీయస్థాయికి ఎంపిక కావడంతో అకాడమీ నిర్వాహకులు, కోచ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లోనూ ఇదే ప్రతిభ కొనసాగిస్తూ జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.


