ఇద్దరు ఆర్‌ఐల సస్పెండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆర్‌ఐల సస్పెండ్‌

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని యాపల్‌గూడ శివారు ప్రాంతాంలో గల 2వ పోలీస్‌ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు ఆర్‌ఐలను సస్పెండ్‌ చేస్తూ అడిషనల్‌ డీజీపీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై బెటాలియన్‌ కమాండెంట్‌ను సంప్రదించగా ఆర్‌ఐ రమేశ్‌ డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణల ఫిర్యాదు మేరకు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. గత నెల 27న బెటాలియన్‌లో ఆర్‌ఎస్సైగా ఉద్యోగం చేస్తున్న రాకేశ్‌ను నరేశ్‌ అనే ఆర్‌ఐ ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనంతో ఢీకొట్టడంతో రాకేశ్‌ ఇచ్చినా ఫిర్యాదు మేరకు రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఆయనను అడిషనల్‌ డీజీపీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఇరువురు తాత్కాలికంగా సస్పెండ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష

ఉట్నూర్‌రూరల్‌: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారులు, సహాయ ప్రాజెక్ట్‌ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులతో వీసీ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో మంద మకరందు హాజరయ్యారు. సమావేశంలో డైట్‌ బిల్లులు, కాస్మొటిక్‌, అద్దె చార్జీల చెల్లింపులు, పాఠశాలలు–వసతి గృహాల నిర్వహణ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సరఫరా, యూనిఫాంల పంపిణీ, ఉపకార వేతనాల మంజూరు అంశాలపై చర్చించారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌, పీఎం–జన్‌మన్‌ పథకాల పనుల పురోగతి, జీసీసీ బిల్లుల రీకన్సిలియేషన్‌, ట్రైకార్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపి, పెండింగ్‌ సమస్యలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

దండారీ సంబురాలు షురూ..

దండేపల్లి: రాష్ట్రంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి గాంచిన మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డునగల ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీపద్మల్‌పురి కాకో ఆలయంలో దండారీ సంబురాలు మొదలయ్యాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ గిరిజనులు కాకోను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో ఆదివాసీ గిరిజనులు గుస్సాడీ వేషాలతో నృత్యాలు చేయడం ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement