అనాథ పిల్లలకు గల్ఫ్‌ సంఘం ఆపన్నహస్తం | - | Sakshi
Sakshi News home page

అనాథ పిల్లలకు గల్ఫ్‌ సంఘం ఆపన్నహస్తం

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

జన్నారం: అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందగా అనాథలైన పిల్లలకు గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం ఆపన్నహస్తం అందించింది. మండలంలో ని రాంపూర్‌ గ్రామానికి చెందిన ఓరుగంటి లింగ య్య మూడేళ్ల క్రితం, దివ్య నెల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఇద్దరు కూతుళ్లు అమూల్య, స్పందన ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో అ నాథలయ్యారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సు దర్శన్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌ సంఘం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించారు. సంఘం ఆధ్వర్యంలో రూ.93,200 పోగు చేసి ఇద్దరు పిల్లల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించినట్లు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమయ్య తెలిపారు. శుక్రవారం బాండ్లను సర్పంచ్‌ నూతి రామయ్య చేతుల మీదుగా పిల్లలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement