ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో జోనల్ స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు పోటాపోటీగా జరిగాయి. పోటీలను డీఈవో సచ్చిదానందచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోనల్ స్థాయి అండర్–14, 17, 19 ఎస్జీఎఫ్ బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో 100, 200, 400, 800, 1,500, 3వేల మీటర్ల రన్నింగ్, లాగ్ జంప్, హై జంప్, షాట్‌ఫుట్, జావెలిన్ త్రో పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోన్రావు తెలిపారు. వీరిలో ప్రతిభ కనబర్చిన 80మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఎస్వో శ్రీనివాస్, నోడల్ అధికారి మీనారెడ్డి, పీడీలు, పీఈటీలు లక్ష్మణ్, రవి తదితరులున్నారు.


