ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని తెలంగాణ ఆది వాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కుమురం భీం 125 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొడుతుందని విమర్శించారు. ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఉయి క విష్ణు, ఉపాధ్యక్షులు పెందూర్ గోవింద్, కుంరం భీంరావు, కనక మలుకు, నాయకులు మెస్రం నగేష్, జగన్, శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రా ఘవులు, రామన్న, తదితరులు పాల్గొన్నారు.


