ఆరు నెలలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆరు నెలలు అప్రమత్తంగా ఉండాలి

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

● కలెక్టర్‌ రాజర్షిషా

కై లాస్‌నగర్‌: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల అధికారులు, మున్సిపల్‌ అధికారులతో జాయింట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడా నీటి వృథా జరగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, ప్రజలు కూడా విద్యుత్‌ను పొదుపుగా, అవసరమైనంత మేరకే వినియోగించాలని సూచించారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం నుంచి చైర్‌పర్సన్‌ బండారి అనూష సతీష్‌, కమిషనర్‌, కౌన్సి లర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అదనంగా ఆరు ట్యాంకర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరానికి మించి నీటిని వినియోగించకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నీటిని వృథా చేస్తే భారీ మొత్తంలో పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు.

అలసత్వం వహిస్తే చర్యలు

కై లాస్‌నగర్‌: గిరిజన సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ రాజర్షిషా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్‌మన్‌, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ పథకాల పురోగతిపై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ మంద మకరందుతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన పీవీటీజీ తెగల కుటుంబాలకు ప్రభుత్వ ఫలాలు పూర్తిగా అందాలనేదే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమన్నారు. గిరిజన పల్లెలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ గిరిజన కుటుంబానికి పక్కా గృహం, ఆధార్‌ కార్డు, బీపీఎల్‌ రేషన్‌ కార్డు, ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌, జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతా వంటి సేవలను వంద శాతం అందించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రవీందర్‌ రాథోడ్‌, హౌసింగ్‌ పీడీ శంకర్‌, డీఎంహెచ్‌వో సాధన, పంచాయతీ అధికారి రమేశ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

కై లాస్‌నగర్‌: నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ పరిధిలో సమగ్ర అభివృద్ధిని సాధించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా అధికా రులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్‌ పరిధి లో నిర్ణయించిన కీలక పనితీరు సూచికల సాధనలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని శాఖల వారీగా క్షుణ్ణంగా సమీక్షించారు. పాత ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందికర అంశాలను తక్షణమే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా మంజూరైన పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలన్నారు. అన్ని శాఖ ల అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించి నార్నూర్‌ బ్లాక్‌ను అన్ని రంగా ల్లో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంక్షేమశాఖ అధికారి మిల్కా, నీతి ఆయో గ్‌ ప్రోగ్రామ్‌ అధికారి రాహుల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement