ఆదిలాబాద్‌టౌన్: ఫ్లాగ్‌డే సందర్భంగా గురువారం రాత్రి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కలెక్టర్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇందులో 250 మంది పోలీసు సిబ్బందితో పాటు 50 మంది డిఫెన్స్ అకాడమి విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్‌లో అమరవీరుల చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు మౌనిక, బి.సురేందర్ రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


