ఒంటికాలిపై నిలబడి నిరసన | - | Sakshi
Sakshi News home page

ఒంటికాలిపై నిలబడి నిరసన

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఆదిలాబాద్‌టౌన్‌: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఒంటి కాలిపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపా రు. ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి దేవిదాస్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఈశ్వర్‌, డాక్టర్‌ సుజాత, సంయుక్త కార్యదర్శి రాజారెడ్డి, కోశాధికారి డి.గితేష్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు గోపాల్‌, చంద్రకళ, కిరణ్‌, నాగభూషణం, రమేష్‌, అనిల్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, లీనా, విజయలక్ష్మి, తులసి, అన్నపూర్ణ, పుష్పలత, రనీత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement