ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఆదిలాబాద్‌: ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటా మని ఆర్‌ఎం విజయభాను అన్నారు. ఆదిలా బాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భాగ్యనగరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేషన్స్‌) ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్‌ ఎన్‌.సాయన్న, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) ఐ.రాజశేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement