కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలపై అలసత్వం ప్రదర్శించకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రులతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. భూసర్వేకు సంబంధించి పలుమార్లు ప్రజావాణిలో విన్నవించినా, సర్వేల్యాండ్ రికార్స్ ఏడీని స్యయంగా రెండుసార్లు కలిసినా స్పందించడం లేదని ఓ బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న ఏడీ ప్రభాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ వారం అందిన అర్జీల్లో కొందరి నివేదన..


