బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ

Oct 20 2026 12:20 AM | Updated on Oct 20 2026 12:20 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించి పోలీసు వ్యవస్థపై ప్రజ ల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 28 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుల సమస్యలపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. చట్టపరిధిలో అవసరమైన చర్యలు తీసుకుని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్‌ కవిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గాదేవి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

దుర్గాదేవి నిమజ్జన, దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బందికి సోమవారం సూచనలు చేశారు. బందోబస్తును తొమ్మిది సెక్టార్లుగా విభజించి, సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం 50 మంది మహిళా సిబ్బందితో పాటు షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్‌ కుమార్‌, కె.నాగరాజు, ప్రేమ్‌కుమార్‌, బి.ప్రణయ్‌, రహీం పాషా, నైలు, ఆర్‌ఐలు డి.వెంకటి, టి.మురళి, ఎన్‌.చంద్రశేఖర్‌, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్వీక్‌ సాయి కొట్టే , సీఐ మడావి ప్రసాద్‌, ఎస్సై విజయ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement